అమీర్ ఖాన్ సినిమా చూస్తూ నిద్రపోయిన కరీనాకపూర్.. బోర్ కొట్టిందా..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన ఏ సినిమాను తెరకెక్కించినా సరే ప్రతీ సారి కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ఇటీవల విడుదల కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ కి జోడిగా కరీనాకపూర్ కూడా నటించింది .ఇక అంతేకాదు ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్న నేపథ్యంలో కరీనాకపూర్ మాత్రం అనూహ్యంగా ప్రవర్తించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక తాజాగా సెలబ్రిటీల కోసం ఇటీవల ఒక ప్రీమియర్ షోను వేయడం జరిగింది. ఇక ఈ షో కి అమీర్ ఖాన్ తో పాటు హీరోయిన్ కరీనాకపూర్ కూడా హాజరవడం జరిగింది . ఇకపోతే లాల్ సింగ్ చద్దా సినిమాను చూస్తూ అమీర్ ఖాన్ ఎమోషనల్ అవుతూ ఉంటే.. కరీనాకపూర్ మాత్రం ఏమీ పట్టనట్టుగా నిద్రపోతూ కనిపించింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పాటు ట్రోల్ కూడా అవుతున్నాయి. ఇక కరీనాకపూర్ నిద్రపోతుండడం చూసి నెటిజన్లు కూడా ఫన్నీగా పోస్ట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

ఇక ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానున నేపథ్యంలో ప్రీమియర్ షో వేయగా కరీనాకపూర్ మాత్రం ఇలా నిద్రపోతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తాను నటించిన సినిమాను తానే చూడలేకపోతే ప్రేక్షకులు ఎలా చూస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి లాల్ సింగ్ చద్దా సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

https://twitter.com/whysaharsh/status/1550090725819174912?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1550090725819174912%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-745604985932805384.ampproject.net%2F2207071723000%2Fframe.html