గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?

విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు.

కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అదే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితం వేరేగా ఉండేది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా టీడీపీ, జనసేనలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేస్తే మాత్రం మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది…రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే..సీటు ఎవరికొచ్చిన గెలిచేస్తారు. విడివిడిగా పోటీ చేస్తే…ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తే..ఓట్లు చీలి, వైసీపీ విజయం సాధిస్తుంది. అలా కాకుండా టీడీపీ నుంచి పల్లా కాకుండా వేరే నేత పోటీ చేస్తే…పవన్ కు గెలిచే ఛాన్స్ ఉంటుంది…అలాగే జనసేన నుంచి పవన్ కాకుండా వేరే నేత పోటీ చేసి…టీడీపీ నుంచి పల్లా పోటీ చేస్తే…గెలుపు పల్లాకు దక్కుతుంది.

అంటే ఇక్కడున్న లాజిక్ ఒక్కటే…వ్యక్తిగతంగా గాజువాకలో పవన్, పల్లాకు మంచి ఫాలోయింగ్ ఉంది. వారిలో ఎవరో ఒకరే పోటీ చేస్తే మాత్రం గెలుపు వైసీపీకి దక్కదు…అలా కాకుండా ఇద్దరు పోటీ చేస్తే గెలుపు వైసీపీదే. ఇదేం లేకుండా టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా సరే వైసీపీ గెలవడం కష్టం. అంటే గాజువాకలో రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు.