ర‌ఘురామ బాట‌లో మ‌రో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమ‌న్న జ‌గ‌న్‌…!

ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ సాగుతోంది. “ఎన్నాళ్ల‌ని చూస్తాం. ఆయ‌న ప‌ద్ద‌తి మార్చు కోవ‌డం లేదు. అందుకే.. మా ప‌ద్ధ‌తిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్ర‌కాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. కొన్ని రోజుల కింద‌ట చేసి న వ్యాఖ్య‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మాగుంట‌.. ఒంగోలు ఎంపీగా విజ‌యందక్కించుకు న్నారు. అయితే.. ఆయ‌న‌కు వైసీపీలో ఇత‌ర‌నేత‌ల‌కు ప‌డ‌డం లేదు.

ఇది చాన్నాళ్లుగా వినిపిస్తున్న మాటే. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌.. టీడీపీ నేత‌ల‌తో చ‌ట్టాప‌ట్టాల్ వేసుకుని తిరుగుతున్నార‌నేది వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన స‌మావే శంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అధికారులు మంచి వారే.. కానీ.. ఎక్క‌డో తేడా వుంది! అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ప‌నులు ముందుకు జ‌ర‌గ‌డం లేద‌ని.. ఎక్క‌డా కూడా అభివృద్ధి లేద‌ని.. ఆయ‌న నేరుగా స‌మావేశంలోనే అన్నారు.

అంతేకాదు.. ఎంపీ లాడ్స్ కింద 2019లో ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు ఇవ్వ‌లేద‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించా రు. క‌రోనా స‌మ‌యంలో ఎంపీ లాడ్స్‌ను కేంద్రం నిలిపివేసింది. ఇలా.. మాగుంట చేస్తున్న‌వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో విష‌యంపార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిన‌ట్టు.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇత‌ర నాయ‌కులు ఎవ‌రూ కూడా ఆయ‌న‌ను క‌ల‌వ‌ద్ద‌ని, ఆయ‌న ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా.. రియాక్ట్ కావొద్ద‌ని.. అధినేత జ‌గ‌నే స్వ‌యంగా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలిసింది.

అంటే.. ఇక‌, మాగుంట‌ను కేవ‌లం.. పార్టీ స‌భ్యుడిగా కంటే.. త‌మ‌కు అనుబంధంగా ఉన్న స‌భ్యుడిగానే చూడ‌నున్నారు. ఇక‌, ఇటీవ‌ల జరిగిన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశానికి కూడా మాగుంట‌ను ఆహ్వానించ లేద‌ని.. అయితే.. విష‌యం తెలుసుకుని.. ఆయనే వ‌చ్చార‌నే చ‌ర్చ కూడా కొన్ని రోజులు సాగింది. అంటే.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఈయ‌న‌ను వ‌దిలించుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. మ‌రి మాగుంట వ్యూహం.. ఏంటో.. ఆయ‌న తిరిగిటీడీపీ గూటికి చేర‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.