“అశ్విని నాచప్ప” గుర్తుందా ? ఈమె కూతుళ్ళ అందం ముందు హీరోయిన్స్ కూడా పనికి రారు

ప్రస్తుతం ఏ రంగంలో చూసినా మగాళ్ళతో పాటు ఆడవాళ్లు కూడా పోటీ పడి మరి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. కానీ ఒక్కప్పుడు మాత్రం దీనికి పూర్తి బిన్నంగా ఉండేవారు, ఆడవారు వంట ఇంటికి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండేవారు. సినీ రంగంలో కూడా అక్కడక్కడా ఇలానే ఉండేది. అందుకే కొంతమంది ఎప్పటికప్పుడు మేము మగ వాళ్ళ కంటే తక్కువ కాదు అని నిరూపిస్తూ వచ్చారు. అందులోనే అథ్లెటిక్స్ లో టాప్ రన్నర్ ఎవరు అంటే ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు పరుగుల రాణి పి.టి.ఉష. కొద్దిరోజుల తర్వాత అశ్విని నాచప్ప వచ్చి పి. టి. ఉష ను ఓడించింది.

అశ్విని నాచప్పకు చిన్నప్పటి నుంచే ఆటలపైన ఎక్కువ ఆసక్తి. అందుకే అథ్లెటిక్స్ లో ఒక స్థానాన్ని సాధించాలి అనే తపనతో అతి తక్కువ కాలంలోనే బెస్ట్ రన్నర్ గా నిలిచింది. అయితే ఈమె స్పోర్ట్స్ లోనే కాదు సినిమారంగంలో కూడా మెప్పించారు. ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు ఆమె జీవిత కథను ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనతో అశ్విని కలసి సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఎవరో ఎందుకు అశ్వినినే హీరోయిన్ గా చేస్తే సరిపోతుంది కదా అని ఫిక్స్ అయ్యి ఆమెని ఒప్పించి తనతోనే హీరోయిన్ క్యారెక్టర్ వేయించారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్అయ్యి, మొదటి సినిమాకే అశ్విని కి నంది అవార్డు వచ్చింది.

ఆ తర్వాత ఆమె వరుసగా ఇన్స్పెక్టర్ అశ్విని, ఆదర్శం, అందరూ అందరే వంటి కొన్ని సినిమాలలో నటించింది. తరువాత కరోభయ్యా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యారు. భర్త నిర్వహించే ఒక స్పోర్ట్స్ అకాడమీ పనులన్నీ అశ్విని చూసుకునేవారు. అశ్విని కి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయి పేరు అనీష, చిన్న అమ్మాయి పేరు దీపాలి. పెద్దమ్మాయి అనీషా బ్యాడ్మింటన్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ గా మరియు చిన్నమ్మాయి దీపాలి కూడా గోల్ఫ్ ప్లేయర్ గా మంచి గుర్తింపును సాధించారు.

ప్రస్తుతం అశ్వినీ నాచప్ప తన పిల్లలతో పాటు ఇంకో 32 మంది ఆడపిల్లలకు శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అశ్విని నాచప్ప గారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఆడ మగ మధ్య ఎప్పుడూ తేడా ఉండకూడదు వాళ్లు చేసే అన్ని పనులు ఆడవాళ్లు కూడా చేయాలి. అయితే ప్రస్తుతం ఆవిడ గ్రామీణ విద్య ను అభివృద్ధి చేసే పనిలో భాగంగా ఒక స్కూల్ ని కూడా స్థాపించారు. ఇప్పటికీ 560 మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు.

అయితే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లోను, ఇటు స్పోర్ట్స్ లోనూ తనకు ఉన్న ప్రావీణ్యంతో ఆడపిల్లలకి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయో కూడా తనకి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కునే విధంగా ఆడపిల్లలలో ధైర్యాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతోనే తన పిల్లలతో పాటుగా వేరే ఆడపిల్లలకు కూడా శిక్షణని అందిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు అశ్విని.