హీరో సుమన్ సినీ జీవితం నాశ‌న‌మ‌వ్వ‌డానికి అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ అందగాడు నవ మన్మధుడు తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని స్టార్ హీరో సుమన్. 1980 లలో తెలుగు సినీ పరిశ్రమను తన కనుసైగలతో శాసించిన హీరో ఇతను. ఆ రోజుల్లో మెగాస్టార్ వంటి స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీగా నిలిచిన వ్యక్తి. అంతేకాదు అయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసేవి. సుమన్ ఎప్పుడు కూడా హీరో కావాలని కోరుకోలేదట. అయన కాలేజీ రోజుల్లోనే అందమైన పర్సనాలిటీకి తోడుగా కరాటే వంటి కోర్స్ ల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

అంతేకాదు వాళ్ల ఇంటి పక్కనే ఉండే వ్యక్తి నువ్వు అచ్చం హీరోలా ఉన్నావు, ఒక్కసారి సినిమాలలో ట్రై చేయొచ్చు కదా అని చెప్తూ ఉండేవాడట. దానికి సుమన్ మనకి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు కదా మనకి ఎవరు అవకాశం ఇస్తారు అని సమాధానం చెప్పేవాడు. అలా వెతుకుతూ ఉండగా ఒకసారి ఒక సినిమాలో నటించే అవకాశం లభించింది. తన మొదటి సినిమానే కేర్ రామం వంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు సుమన్. ఆయన దర్శకత్వంలో నిర్మించిన “నీచకాలు” అనే సినిమాతో 1977 లో తమిళంలోకి అరంగేట్రం చేసాడు.

ఆ రోజుల్లోనే 5 లక్షల రెమ్యూనరేషన్ అందుకనే టాప్ హీరోగా అందనంత ఎత్తులోకి ఎదిగిపోయాడు. అటు తర్వాత సినీ ఇండస్ట్రీలోనే మెగా స్టార్ చిరంజీవికే ధీటుగా పోటీపడేవాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన సుమన్ జీవితంలోనే చెరగని మచ్చలా మిగిలిపోయింది. అదే అమ్మాయిలతో బ్లూ ఫిలిమ్స్ చేయిస్తున్నాడనే ఆరోపణ. షీలా, వీణ మరియు లక్ష్మి అనే ముగ్గురు అమ్మాయిలు హీరో సుమన్ పై కేసు పెట్టడంతో పోలీసులు సుమన్ వుడా ఆక్ట్ కింద నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేశారు.

దీనితో సుమారు ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఎన్ని కష్టాలు పడినా కూడా అవేవి తన సినీ జీవితంపై ప్రభావితం చూపలేకపోయాయి. ఎందుకు అంటే ఆ తర్వాత ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఆమె పేరు శిరీష , ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు అఖిల ప్రత్యూష. ఆయన కూతురు అప్పట్లో ఒక డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చి హైదరాబాద్ దృష్టిని ఆకర్షించింది.