ప‌వ‌న్‌తో ఏ డైరెక్ట‌ర్ అయినా మూడో సినిమా చేస్తే.. ఇంత సెంటిమెంట్ ఉందా…?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్‌లో 27 సినిమాల్లో న‌టించాడు. ప‌వ‌న్ కెరీర్ స్టార్ట్ చేసి చాలా యేళ్లు అవుతోంది. అయితే మ‌ధ్య‌లో చాలా గ్యాప్‌లు వ‌చ్చాయి. లేక‌పోతే ఈ పాటికే 40కు పైగా సినిమాలు చేసి ఉండేవాడు. ఖుషీ త‌ర్వాత గ్యాప్‌, జానీ త‌ర్వాత మ‌ళ్లీ గ్యాప్‌.. జ‌ల్సా త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్ల‌డంతో గ్యాప్‌, అజ్ఞాత‌వాసి త‌ర్వాత వ‌కీల్‌సాబ్ వ‌చ్చేవ‌ర‌కు గ్యాప్ ఇలా చాలా గ్యాప్‌ల‌తో ప‌వ‌న్ ఎక్కువ సినిమాలు చేయ‌లేదు.

ఇక హీరోగా 25 సినిమాలు చేసిన ప‌వ‌న్‌.. మ‌రో రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. ప‌వ‌న్ కెరీర్‌లో హిట్ అయిన సినిమాలు చూస్తే గోకులంలో సీత – సుస్వాగ‌తం – తొలిప్రేమ – త‌మ్ముడు – బ‌ద్రి – ఖుషి – జ‌ల్సా – గ‌బ్బ‌ర్ సింగ్ – అత్తారింటికి దారేది – గోపాల గోపాల – వ‌కీల్ సాబ్ – భీమ్లా నాయ‌క్ సినిమాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 12 సినిమాల్లో 7 సినిమాల‌కు ఆయా ద‌ర్శ‌కుల కెరీర్‌లో అవి మూడో సినిమాలు. అవ‌న్నీ హిట్ అయ్యాయి.

అంటే ఏ డైరెక్ట‌ర్ అయినా త‌న కెరీర్‌లో మూడో సినిమా ప‌వ‌న్‌తో చేస్తే హిట్ కొట్టేసిన‌ట్టే..! శుభ‌మ‌స్తు, శుభాకాంక్ష‌లు త‌ర్వాత భీమినేని శ్రీనివాస‌రావుకు సుస్వాగ‌తం మూడో సినిమా – అలాగే వాలి, ఖుషీ (త‌మిళ్‌) త‌ర్వాత ఎస్‌.జె. సూర్య‌కు తెలుగు ఖుషీ – నువ్వే నువ్వే, అత‌డు త‌ర్వాత త్రివిక్ర‌మ్‌కు జ‌ల్సా – షాక్‌, మిర‌ప‌కాయ్ త‌ర్వాత హ‌రీష్‌శంక‌ర్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ – కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం, త‌డాఖా త‌ర్వాత‌ కిశోర్ కుమార్ పార్ద‌సాని (డాలీ)కి గోపాల గోపాల కూడా మూడో సినిమాయే.. ఇవ‌న్నీ హిట్ అయ్యాయి.

ఇక వేణుశ్రీరామ్‌కు ఓ మై ఫ్రెండ్‌, ఎంసీఏ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ మూడో సినిమా, అలాగే అయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడుత‌రువాత త‌న మూడో సినిమాగా భీమ్లానాయ‌క్ తీశాడు సాగ‌ర్ కె .చంద్ర.. అలా ఏ డైరెక్ట‌ర్ అయినా త‌న కెరీర్‌లో మూడో సినిమా ప‌వ‌న్‌తో చేస్తే హిట్ కొట్టేసిన‌ట్టే..!