ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న వైసీపీకే మేలు చేస్తుందా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నపై అధికార పార్టీ వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చం.. అంటూ.. ప‌వ‌న్ పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌క‌టించారు. అంటే.. మ‌ళ్లీ పాత‌మిత్రుల‌ను క‌లుపుకొని వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీనిపై వైసీపీ నాయ‌కులు.. ఏమ‌న్నారంటే.. ఇదే త‌మ‌కు కూడా కావాల‌ని చెబుతున్నారు.. అస‌లు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేద‌ని.. ఉన్నా.కూడా అది 5 శాతం లోపేన‌ని.. దీనివ‌ల్ల త‌మ‌కు ఇబ్బంది లేద‌ని చెబుతున్నారు.

అంతేకాదు..ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఆయ‌న‌లోని డొల్ల‌త‌నాన్ని నిరూపిస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు అంటు న్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌ను ఒంట‌రిగా ఎదుర్కొనే స‌త్తా చేయ‌లేక పోతున్నార ని.. అందుకే… ప‌వ‌న్‌ను రంగంలోకి దింపుతున్నార‌ని.. ఒక్క నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు.. ఇంత మంది ఏకం అవుతున్నారంటేనే.. వైసీపీ స‌హా.. జ‌గ‌న్ ఎంత బ‌లంగా ఉన్నారో.. అర్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే.. జ‌గ‌న్‌పై ఈ రేంజ్‌లొ రాజ‌కీయాలు స‌మీక‌రించుకుంటున్నారంటే.. ఈ మూడేళ్ల పాల‌న‌లో.. జ‌గ‌న్ ఎలా బ‌లోపేతం అయ్యారో.. అర్ధం అవుతోంద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. ప్ర‌భుత్వం ఇమేజ్ మ‌రింత పెరిగింద‌ని.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సంద‌ర్భాల్లోనూ.. ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌ని.. పేర్కొన్నారు. అంతేకాదు.. అమ్మ వొడి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇత‌ర పార్టీలు ఏం చేస్తాయో.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లో సెంటిమెంటుగా మారిపోయాయ‌ని.. వీటిని కాద‌ని ఏ పార్టీ కూడా ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని.. వీటిపై ప్ర‌జ‌ల‌కు వారు స‌మాధానం చెప్పాల‌ని.. వైసీపీ నాయ‌కులు అంటున్నారు. కానీ, ఏ పార్టీ కూడా ఈ ప‌థ‌కాల‌పై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం.. లేద‌ని.. సో.. ఇదే త‌మ‌కు మేలు చేస్తుంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.