సినిమాలలోకి వచ్చిన తర్వాత రాజమౌళి సంపాదన ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శక దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తెలుగు సినీ ఖ్యాతి ని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దిన ఘనత రాజమౌళికి దక్కిందని చెప్పవచ్చు. ఇకపోతే రాజమౌళి మొదట రచయితగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు అయితే తాను అనుకున్న విధంగా దర్శకుడు హీరో హీరోయిన్లను చూపించ లేదనే కారణంతో ఆయనే స్వయంగా డైరెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్నాడు అలా మొదటి సారి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ కి ఎపిసోడ్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టడం జరిగింది.

ఇక ఆ తర్వాత మంచి హీరో కోసం , సినిమా కథల కోసం వెతుకుతున్న సమయంలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి అటు ఎన్టీఆర్ కి కూడా హీరోగా మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న సమయంలోనే బాహుబలి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకు గాను ఈయన లాభాలలో 30 శాతం వాటా తో పాటు 24 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నారట. ఇక మొత్తంగా రాజమౌళి సినిమాలలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న ఆస్తి ఇప్పుడు 300 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గడిచిన మూడు సంవత్సరాల లోపు రాజమౌళి ఆస్తి 40% పెరిగినట్లు సమాచారం. ఇక 2008వ సంవత్సరంలో బంజారా హిల్స్ లో ఒక ఇల్లు ని కొనుగోలు చేశారు. ఇక అంతే కాకుండా పలుచోట్ల రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం. 4 ఖరీదైన కార్లు ధర.. రూ.15 కోట్లు విలువ చేస్తాయి.