అక్కినేని బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ.. నాగచైతన్య స్టార్ హీరో కాకపోవడానికి 10 కారణాలు ఇవే?

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్.. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు.. అల్లు వారి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్.. ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోగా నాగార్జున ఎదిగినట్లు నాగార్జున కొడుకు లు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగా లేకపోతున్నారు. అఖిల్ ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తుంటే నాగచైతన్య హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఇంకా మిడ్ రేంజ్ హీరోగా అనిపించుకుంటున్నాడు. మరి నాగచైతన్యకు ఎన్ని సినిమాలు చేసినా ఎందుకు స్టార్ ఇమేజ్ రావడం లేదు అన్న విషయంపై ఒక లుక్కేద్దాం.

1.అక్కినేని అనే స్టార్ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఇక ఆ తర్వాత తండ్రి నాగార్జున కూడా స్టార్ హీరో నే.. ఇలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన చైతన్య ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోతున్నాడు.

2. ఇక తండ్రి నవమన్మధుడు గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు జోష్ గా కనిపిస్తాడు నాగార్జున. కానీ నాగచైతన్య ఎంతో ఎంత సైలెంట్ గా ఉంటాడు.

3.ఇలాంటి కార్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చే హీరో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా కూడా బాగుంది కానీ స్టార్ హీరో రేంజ్ లో లేదు. ఆ తర్వాత సినిమాకైనా సర్దుకుపోతూ ఉంది అనుకుంటే చైతన్య వరుసగా లవ్ స్టోరీ ల బాట పట్టాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న లాయల్ ఫాన్స్ చైతన్యను పట్టించుకోవడం లేదు.

4.నాగచైతన్యకు మంచి విజయాలు కూడా ఉన్నాయి. గత నాలుగు సినిమాలు కూడా మంచి హిట్. కానీ అతను కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం లేదు అందుకే స్టార్ కాలేక పోతున్నాడు.

5.ఇక నాగచైతన్య నటించిన సినిమాల్లో హీరోయిన్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవల బంగార్రాజు హిట్ కొట్టినా అది నాగచైతన్య కలిసి రాలేదు.

6. మొన్నటి వరకు ఎంతో మంది స్టార్ దర్శకులతో సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పటికీ నాగచైతన్య మాత్రం నో చెప్పాడట. త్రివిక్రమ్ వి.వి.వినాయక్ అనిల్ రావిపూడి బోయపాటి శ్రీను లాంటి దర్శకులకు నో చెప్పాడట నాగచైతన్య.

7.అప్పటికే సెటిలైన దర్శకులతో కాకుండా కొత్త దర్శకులతో మాస్ సినిమాలు చేస్తూ ఉంటాడు నాగ చైతన్య. ఇక సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైన చివరికి ప్రేక్షకులను నిరాశపరుస్తూ ఉంటాయి.

8.ఇక ఇటీవల కాలంలో ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటె నాగచైతన్య మాత్రం అభిమానులతో టచ్లో ఉండడు.

9. మొహమాటం కొద్దీ కొన్ని సినిమాలను నాగచైతన్య ఓకే చేస్తుంటాడు అనే టాక్ ఉంది. అలాంటి సినిమాలు ఓకే చేసి బొక్క బోర్లా పడిపోయాడు నాగచైతన్య.

10.ఇక మంచి క్రేజ్ ఉన్న దర్శకులతో సినిమాలకు ఓకే చెబుతూ మంచి బ్యానర్లో సినిమాలు తీస్తే ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరో రేసులో కి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.