పాపం చైతు.. ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభం..ఆ కోరికను తీర్చుకోలేకపోతున్నాడే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ..పాన్ ఇండియా రేంజ్ లో మూవీలు తీయ్యడానికే ఇష్టపడుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్,చరణ్,తారక్,..ఇలా అందరు ఒకరు తరువాత ఒకరు వరుసగా పాన్ ఇండియా సినిమాల పై మోజు పడుతున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.. ఒక్క సినిమాతో చాలా భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు..తమ నటనను ..తమలోని టాలెంట్ ను ఇతర ఇండస్ట్రీ వాళ్లకి కూడా పరిచయం చేయచ్చు..తద్వారా అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు..ఫైనల్ గా భారీగా రెమ్యూనరేషన్ అందుకోవచ్చు..ఇలా ఒక్క సినిమాతోనే అన్ని లాభాలు వస్తుంటే ఏ హీరో అయినా ఎందుకు ఇంట్రెస్ట్ చూయించరు. ఖచ్చితంగా అలాంటి సినిమాలో నటించాలని ప్రతి హీరోకి ఉంటాది. కానీ అవి కొందరి హీరోలకే సెట్ అవుతాయి.

ఇక అలాంటి లిస్ట్ లోకే వస్తాడు స్టార్ హీరో నాగార్జున కొడుకు నాగచైతన్య . మిగతా హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ..100 కోట్ల క్లబ్ అంటూ..రైయ్ రైయ్ మని దూసుకుపోతుంటే అక్కినేని వారసుడు నాగచైతన్య మాత్రం..ఎటూ కదల లేక అక్కడే ఆగిపోయాడు అంటున్నారు నెటిజన్స్. నిజం చెప్పాలంటే నాగ చైతన్య సినిమాలు పట్టుమంటే పది కూడా హిట్ అవ్వలేదు..యాక్టింగ్, డ్యాన్స్ పరంగా కూడా చై చాలా డెవలప్ అవ్వాలి..నాగ చైతన్య కూడా నేర్చుకుంటున్నాడు..కానీ ఇప్పుడున్న కాంపీటీషన్ తట్టుకోవాలంటే స్పీడ్ ముఖ్యం. కధను సెలక్ట్ చేసుకునే టప్పుడు మనకు సూట్ అయ్యేలా ఉండాలి..అడ్జెస్ట్ అయ్యేలా ఉండకూడదు అంటూ అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు.

ఇక నాగార్జున కూడా కొడుకుల భవిష్యతు పై డిలా పడిపోతున్నారని టాక్ వినిపిస్తుంది. మిగతా హీరోలు పెళ్లిలు చేసుకుని..పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అది లేదు. పోనీ సినిమా ల విషయంలోనైన ఆ హ్యాపీనేస్ ఉందా అంటే అది లేదు. అందరు 100 కోట్ల క్లబ్ లో చేరుతుంటే చై ఇంకా 50 లోనే ఉన్నాడు. ఇక అఖిల్ అయితే ఇప్పట్లో ఆ దరిదాపుల్లో కనబడే అవకాశాలు కనిపించడంలేదు . ఇప్పుడు నాగ్ ఆశలు అన్నీ కూడా చై మీదనే పెట్టుకుని ఉన్నాడు. కనీసం ఈయన అయినా తన వర్క్ పర్ ఫామెన్స్ పెంచి..నాగార్జున కొరికను నెరవేర్చాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం నెగిటీవ్ గా స్పందిస్తూ.. మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏం లాభం..100 కోట్ల క్లబ్ లో చేరి ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి నాగ్ కోరికను చై ఎప్పటికి నెరవేరుస్తాడో..?