త‌న వ‌య‌సెంతో చెప్పేసిన అన‌సూయ‌… ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే…!

అన‌సూయ బుల్లితెర‌పై ఓ సంచ‌ల‌నం… బుల్లితెర యాంకర్ల‌కు కూడా హీరోయిన్ల‌ను మించిన హాట్ ఇమేజ్ ఉంటుందా ? అన్న ప్ర‌శ్న ప‌టాపంచ‌లు చేస్తూ బుల్లితెర యాంక‌ర్ల‌కు కూడా హీరోయిన్ల‌ను మించిన గ్లామ‌ర్ ఇమేజ్ ఉంటుంద‌ని చెప్పిన హాట్ యాంక‌ర్ అన‌సూయే..! న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అన‌సూయ స్టార్ యాంక‌ర్‌గా ఎదిగిన తీరు పెద్ద షాకింగ్‌. ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా అన‌సూయ హాట్ ఇమేజ్‌తో కుర్ర కారు మ‌దిలో అలా నిలిచిపోయింది.

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ల‌కు పోటీ వ‌చ్చి నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్లో ఉన్న ఆమె అటు వెండితెర‌పై కూడా న‌ట‌న‌తో త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా, పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా ఆమె ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఈ రెండు పాత్ర‌లు చూస్తే చాలు అన‌సూయకు భ‌విష్య‌త్తులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంత టాలెంట్ ఉందో తెలుస్తోంది. క్ష‌ణం లాంటి థ్రిల్ల‌ర్ సినిమాలో కూడా ఆమె ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది.

కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా కూడా అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా ఆమె వైట్ శారీలో ఏంజెల్‌లా మెరిసిపోతోన్న ఇమేజ్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోకు ఆమె అభిమానులు, నెటిజ‌న్లు అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోపై ఓ జ‌ర్న‌లిస్ట్ కామెంట్ రాస్తూ 40 ఏళ్ల + వ‌య‌స్సులో కూడా అన‌సూయ అందం ఏ మాత్రం వ‌న్నె త‌గ్గ‌లేద‌ని రాసుకువ‌చ్చాడు. దీనిపై అన‌సూయ స్పందించింది.

నా వ‌య‌స్సు 40 కాదు 36.. నేను ఎప్పుడూ అందంగా క‌నిపించే విష‌యంలో ఏ మాత్రం సిగ్గుప‌డ‌ను.. మీరు మీ జ‌ర్న‌లిజంలో నిబ‌ద్ధ‌త‌తో, న్యాయంగా ప‌ని చేయాల‌ని చెప్పిన అన‌సూయ‌, మీరు మీ వివ‌ర‌ణ ద్వారా మ‌రింత‌గా గౌర‌వింప‌బ‌డ‌తారంటూ ఆమెకు ఆన్స‌ర్ ఇచ్చింది. ఏదేమైనా అన‌సూయ వ‌య‌స్సు జ‌స్ట్ 36 మాత్ర‌మేనా ? ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయ్యి.. ఇంత చ‌లాకీగా ఉంటోన్న అన‌సూయ అందం మామూలుది కాద‌న్న కామెంట్లు వ‌స్తున్నాయి.