లేట్ అయితే ఇంతే..పూజాకు సమంత కౌంటర్ మామూలుగా లేదుగా..!!

సమంత..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో లో ఉంటుంది. పర్ ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ..ఎటువంటి క్యారెక్టర్లకైన సెట్ అయ్యే విధంగా తన బాడీని మౌల్డ్ అప్ చేసుకోవడం సమంత స్పెషాలిటీ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో బడా బడా హీరోల సరసన అంటించే అవకాశాలు కొట్టేసిందంటే ..అమ్మడు పర్ ఫామెన్స్ ఏంటో మనకు అర్ధమైపోతుంది. పెళ్లి తరువాత సినిమా విషయంలో కొంచెం స్లో అయిన సమంత..విడాకుల తరువాత మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

ఇక విడాకుల తరువాత అమ్మడు ఎలాంటి రోల్స్ అయిన చేస్తుంది..కండీషన్స్ పెట్టదు అనుకున్నారు ఏమో డైరెక్టర్స్ తెలియదు కానీ..వరుస ఆఫర్లు ఇస్తూ..సమంతను ను లైన్లో పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు ఖాళీ లేనంత గా కాల్ షీట్లు ఫిల్ అయిపోయాయట సమంతకి. అంత బిజీ గా ఉంది అమ్మడు. ఎంత బిజీ అయినా కానీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం మాత్రం మానదు సమంత.

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన “బీస్ట్‌”లోని పెప్పీ ట్రాక్ “అరబిక్ కుతు” సోషల్ మీడియా ఛాలెంజ్‌గా మారిన విషయం తెలిసిందే. పాట బీట్‌ మాసీగా ఉండటంతో పాటు..దానికి తగ్గత్లు అదిరిపోయే మాస్ స్టెప్పులు ఉండటంతో… ఈ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. హీరో శివకార్తికేయన్ సాహిత్యం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన సంగీతం ఈ పాటకు హైలెట్ అయ్యాయి. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్ జోష్ లో ఊగిపోతున్నారు. కాగా, పూజా మాల్దీవుల పర్యటనలో ఒక పడవలో “అరబిక్ కుతు” ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా సమంత ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో తీరిక టైం దొరకడంతో అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసింది. ఇక ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు అర్దరాత్రి విమానం ఆలస్యం.. ఈ రాత్రికి రిథమ్ అరబిక్ కుతు.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది . ఇక నైట్ అలా డ్యాన్స్ చేస్తున్నా కూడా సమంత హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు అయితే పూజా కన్నా కూడా సమంత నే బాగా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.