సాయి పల్లవి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.
అలాగే ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే ఎప్పుడూ ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకుంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో ఈ అందాల భామ ఏకంగా నాలుగైదు చిత్రాలను వదిలేసింది.
మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం `సరిలేరు నీకెవ్వరు`, పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్`, విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్`, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న `ఛత్రపతి` రీమేక్ వంటి చిత్రాలు సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రాలతో పాటుగా పలు వాణిజ్య ప్రకటనలలో యాక్ట్ చేసే ఆఫర్లను సైతం సాయి పల్లవి వదిలేసిందట.
కాగా, ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి హిట్ అందుకున్న ఈ భామ.. మరోవైపు రానా సరసన `విరాటపర్వం`, నాని సరసన `శ్యామ్ సింగరాయ్` చిత్రాల్లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.