`ఛలో` చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక.. ప్రస్తుతం దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడలోనే కాదు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మిక తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటూ.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇష్టమైన వాడికి లిప్ లాక్ ఇస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఇంతకీ ఆమె ఎవరినీ కిస్ చేస్తుందో తెలుసా.. తన పెంపుడు కుక్క `పూచ్ ఓరా`ని. ఫోటోతో పాటు వెల్కమ్ హోం కిస్సెస్ అనే క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది రష్మిక. ఇప్పుడా ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక అభిమానులు ఊరుకుంటారా..? `ఆ ఛాన్స్ మాకు రాలేదే.. ఒరాను చూస్తుంటే అసూయగా ఉంది. కనీసం కుక్కలా పుట్టిన బాగుండేది.`అని కామెంట్ పెడుతున్నారు.
కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌తో ఈమె నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరోవైపు ఈ భామ శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు, బాలీవుడ్లో మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రష్మిక చేతిలో ఉన్నాయి.
https://www.instagram.com/p/CXA31onJkYw/?utm_source=ig_web_copy_link