`అఖండ‌` డే 3 క‌లెక్ష‌న్స్‌..బాల‌య్య దుమ్ము దులిపేస్తున్నాడుగా!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన మూడో చిత్ర‌మే `అఖండ‌`. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్‌తో పాటుగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవ‌డంతో ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ దుమ్ము దులిపేస్తోంది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 కోట్ల షేర్, రెండో రోజు రూ.6.83 కోట్ల షేర్ ను క‌లెక్ట్ చేసిన అఖండ‌.. మూడో రోజూ రూ.7.03 కోట్ల‌ను సాధించింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అఖండ తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.25 కోట్ల‌ను కొల్ల‌గొట్టిన‌ట్టైంది. మొత్తానికి రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు అఖండ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రింత జోరు చూపించ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక ఏరియాల వారీగా అఖండ మూడు రోజు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 2.51 కోట్లు
సీడెడ్ – 1.78 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 53 ల‌క్ష‌లు
వెస్ట్ – 32 ల‌క్ష‌లు
గుంటూరు – 43 ల‌క్ష‌లు
కృష్ణా – 41 ల‌క్ష‌లు
నెల్లూరు – 23 ల‌క్ష‌లు
——————————————————————
ఏపీ + తెలంగాణ = 7.03 కోట్ల షేర్‌(గ్రాస్‌: 11.20 కోట్లు)
—————————————————————–

కాగా, అఖండ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.53 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడీ చిత్రం రూ. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. అయితే ప్ర‌స్తుతం అఖండ జోరు చూస్తుంటే.. బాల‌య్య ఖ‌చ్చితంగా టార్గెట్‌ను రీచ్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.