పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొని ఐరన్ లెగ్ అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుని లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరైన పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
మరోవైపు `ఆల్ అబౌట్ లవ్` అనే ఫౌండేషన్ ప్రారంభించిన పూజా హెగ్డే.. దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ వృత్తి పరమైన విషయాలనే కాకుండా.. వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. తన పెళ్లి గురించి కూడా పూజా ఓపెన్ కామెంట్స్ చేసింది.
బుట్టబొమ్మ వివాహం గురించి మాట్లాడుతూ.. `ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు, ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్నాను. కానీ, నేను నమ్మేది ఒకటే. వీళ్లతో జీవితాంతం కలిసుంటే బావుంటుంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడి వల్లో, అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారనో మాత్రం చేసుకోకూడదు.` అని చెప్పుకొచ్చింది.
కాగా, పూజా సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌తో ఈమె నటించి `రాధేశ్యామ్` చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే తెలుగులో `ఆచార్య`, తమిళంలో `బీస్ట్`, హిందీలో `సర్కస్` చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తోంది. వీటితో పాటుగా మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఆమె చేతులో ఉన్నట్లు సమాచారం.