యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు.
గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ బాస్ అతడిని బయటకు పంపించేశాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రవి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో తనకు జరిగిన ఓ నమ్మకద్రోహం గురించి చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. `అన్నా బిజినెస్ పెట్టాలి, మా పరిస్థితి అంత బాగోలేదు అని తెలిసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు రెండు సంవత్సరాల పాటు నాతోనే ఉన్నాడు. అతడికి మందు అలవాటు లేదు, రోజూ గుడికి వెళ్తాడు, నమ్మకస్తుడు.. అందుకని ఏం ఆలోచించకుండా వెంటనే రూ.45 లక్షలు ఇచ్చాను.
ఇరవై రోజుల్లో తిరిగిస్తా అని చెప్పాడు. కానీ, ఇప్పటికీ ఇవ్వలేదు. నా వల్ల ఒకడు బాగుడపతాడు కదా అని లెక్కపత్రం కూడా తీసుకోకుండా డబ్బిచ్చాను, కానీ అతడు మోసం చేశాడు.` అంటూ రవి చెప్పుకొచ్చాడు. మొత్తానికి అలా నమ్మిన వ్యక్తి చేతుల్లో అడ్డంగా మోసపోయిన యాంకర్ రవికి రూ.45 లక్షలు టోకరా పడింది.