కెరీర్ మొదలైన దశలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్ని మాస్, రొటీన్ సినిమాలే చేశాడు. ఇజం సినిమా వరకు కూడా ఒకే లుక్ మెయిన్ టైన్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇజం తర్వాత ఎమ్మెల్యే, 118, ఎంత మంచి వాడవురా వంటి సినిమాలను కళ్యాణ్ రామ్ చేశాడు.
ఇప్పుడు సొంత బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో సోషియో పాంటసీగా నిర్మితమవుతున్న ఈ సినిమాకు న్యూ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదల అయిన ఈ మూవీ టీజర్ అందరినీ మెప్పించింది.
కాగా కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొదటి సారి హే రామ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఈ మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. బింబిసార సినిమా విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ మరింత వేగవంతం చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ఈ రెండు సినిమాలతో పాటు డెవిల్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.