మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై అఖండ విజయం సాధించింది. ప్రస్తుతం భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం విడుదలై వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది.
ఇక ఈ చిత్రంలో బాలయ్య ఎంత హ్యాండ్సమ్‌గా కనిపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మురళీకృష్ణ పాత్రలో బాలయ్య హెయిర్ స్టైల్ అదిరిపోయిందని చెప్పొచ్చు. సాధారంగా బాలయ్యకు విగ్గుల దగ్గరే సమస్య. ఒక్కో సినిమాకు బాలయ్య ఒక్కో విగ్ వాడుతుంటారు. కొన్నిసార్లు విగ్గులు సరిగ్గా సూట్ అవ్వకపోతే.. ఆ ఎఫెక్ట్ బాలయ్య లుక్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
కానీ, అఖండలో మాత్రం బాలయ్య వాడిన విగ్ ఆయన అందాన్ని మరింత రెట్టింపు చేసేసింది. అయితే ఇప్పుడు ఆ విగ్గు ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అఖండ సినిమాలో బాలయ్య విగ్గు కోసమే.. ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టారట బోయపాటి. మురళీకృష్ణగా బాలయ్య వాడిన విగ్గు ధర రూ.13 లక్షలు.
అలాంటి విగ్గులు అఖండ కోసం మూడు వాడగా.. వాటి ఖర్చు రూ. 39 లక్షల వరకు అయిందట. ఇక బాలయ్యకు ఈ విగ్గుని అతికించడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి ముంబైకి చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్‌ను నియమించారట. అతడికి రూ. 12 లక్షలు ముట్టచెప్పగా.. మొత్తంగా రూ.50 లక్షల వరకు ఖర్చు అయిందని సమాచారం.