`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఇటీవలె పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని.. ఈ మూవీలో బాలయ్య మాస్ గెటప్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. బాలయ్య ఎప్పటి నుంచో `శంకరాచార్య` పాత్రను పోషించాలనుకుంటున్నారు.
హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. అటువంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించాలని బాలయ్య ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. `బాలకృష్ణ డ్రీ మ్ ప్రాజెక్ట్… శంకరాచార్య. అందుకోసం స్క్రిప్టు ప్రిపేర్ అవుతోంది.
బాలయ్య అనుమతి ఇస్తే.. ఈ సినిమాకి నిర్మించేందుకు నేను సిద్ధంగా ఉన్నా` అని సి.కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈయన వ్యాఖ్యలు బట్టీ చూస్తుంటే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై బిగ్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.