పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రమే `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్ కోశియుమ్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో పవన్ భీమ్ల నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్, రానా డేనియర్ శేఖర్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు. ఓ డబ్బున్న వ్యక్తి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ రన్ టైంని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఉన్న సినిమా కావడం ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేశారట.
రన్ టైమ్ ఇలా లాక్ చేయడం వల్ల కథ త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా భీమ్లా నాయక్ వాయిదా పడనుందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కానీ, మేకర్స్ మాత్రం అనుకున్న తేదీకే భీమ్లా నాయక్ వస్తుందని.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.