స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

ఇప్పటికే ఈ స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవ్వ‌గా.. పుష్ప మేక‌ర్స్ తాజాగా సామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. డిసెంబర్‌ 10న ఈ స్పెష‌ల్ సాంగ్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఊ అంటావా?.. ఉఉ అంటావా? అంటూ సాగే ఈ పాటకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ అందించ‌గా.. బాలీవుడ్ నుంచి గణేష్ ఆచార్య రంగంలోకి దిగి కొరియోగ్రాఫి చేశార‌ట‌.

సమంత త‌న కెరీర్‌లో మొదటి సారి ఐటెం భామ‌గా మార‌డంతో.. ఈ సాంగ్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నారు. పైగా ఈ మాస్ మ‌సాలా సాంగ్‌లో బ‌న్నీతో పాటు సామ్ కూడా స్టెప్పులు ఇర‌గ‌దీసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే రేపు సాంగ్ విడుద‌ల‌య్యాక సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చే అని అంటున్నారు.

కాగా, ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల కాబోతోంది. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.