నేడు `అఖండ` విజయోత్సవ జాతర.. గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం అఖండ విజ‌యం సాధించింది.

ఈ నేపధ్యంలో `అఖండ విజయోత్సవ జాతర` పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్‌ను​ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్ ఉడా పార్క్ వ‌ద్ద ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే అందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అవ్వ‌గా.. అఖండ యూనిట్ మొత్తం ఈ వేడుక‌లో పాల్గొన‌బోతోంది.

అలాగే ఈ సక్సెస్​ మీట్‌కు వేలాది మంది అభిమానుల‌తో పాటుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేయ‌బోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

కాగా, ఈ చిత్రంలో అఖండగానూ, ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ అద్భుత‌మైన న‌ట‌నను క‌న‌బ‌రిచి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే బోయ‌పాటి డైరెక్ష‌న్‌, త‌మ‌న్ అందించిన మ్యూజిక్ సినిమా హిట్ అవ్వ‌డానికి కార‌ణం అయ్యాయి.