మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహం నిన్న అంగ రంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్పల ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన తన ఫాలోవర్స్ షేర్ చేసుకుంది.
మరోవైపు మరదలి పెళ్లిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫుల్ సందడి చేశారు. ముఖ్యంగా సంగీత్ వేడుకలో చరణ్ మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండడంతో.. మెగా ఫ్యాన్స్ దాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు, ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`లో నటించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ చిత్రం తర్వాత చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించాడు. ఈ మధ్యే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, నవీన్ చంద్ర ఈ మూవీలో కీలక పాత్రలు పోసిస్తున్నారు.