సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఎన్నో చిత్రాలు చేశాడు. ఇక ఆ సమయంలోనే మహేష్ బాబు ఓ హీరోయిన్‌ను పిచ్చ పిచ్చగా ఇష్టబడ్డారట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతిలు జంటగా నటించిన `కొడుకు దిద్దిన కాపురం` సినిమాలో మహేష్ బాబు ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై ఘట్టమనేని కృష్ణ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతి మహేష్ బాబుతో ఎంతో సన్నిహిత్యంగా ఉండేవారట. ప్రతి రోజు మహేష్ బాబుకి ఇంటి నుంచి భోజనం తీసుకువచ్చి స్వయంగా తానే వడ్డించి తినిపించేదట. దీంతో మహేష్ బాబు విజయశాంతిని అమితంగా అభిమానించేవారట. పైగా తన ఫస్ట్ లవ్ కూడా విజయశాంతి అంటూ మహేష్ బాబు ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.
ఇక ఆ అభిమానంతోనే చాలా కాలం తర్వాత విజయశాంతితో `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.