ఆర్ఆర్ఆర్ ట్రైలర్ టాక్: నక్కల వేట కాదు.. కుంభస్థలాన్ని బద్దలుకొట్టేశారు!

December 9, 2021 at 11:36 am

ఎప్పుడెప్పుడా అని యావత్ ఇండియన్ సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అందరూ అనుకున్నదే జరిగింది. కాదు.. అంతకు మించి జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్‌తోనే రికార్డుల పనిపట్టడం స్టార్ట్ చేశాడని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం సూపర్బ్. ఇక స్ట్రెయిట్‌గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎలా ఉందో విశ్లేషణకు వస్తే.. ఈ సినిమా కథను పూర్తిగా ఫిక్షనల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు. బ్రిటిష్ వారిని ఎదురించే గోండు బిడ్డ కొమురం భీం(ఎన్టీఆర్) ట్రైలర్‌లోనూ అదరగొట్టాడు.

గోండు ప్రజలను కష్టాలుపెడుతూ హింసిస్తున్న బిట్రిష్ వారిని ఎదురించే వీరుడిగా తారక్‌ను మనకు చూపించారు. ఇక గోండు ప్రజలకు అండగా భీం ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ వారు అతడిని ఎదురించే సత్తా కలిగిన పోలీస్ ఆఫీసర్ రామరాజు(చరణ్)ను రంగంలోకి దింపుతారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన సీన్స్‌ను మనకు ట్రైలర్‌లో చూపించారు. అయితే ఒక సంఘటన కారణంగా భీం, రామ్ చేతులు కలుపుతారు. ఇక అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. వారిద్దరు కలిసి బ్రిటిష్ పాలకుల అకృత్యాలను ఎలా ఎదురించారనేది మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు జక్కన్న ఈ మూడు నిమిషాల ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశాడు.

ఇక ఈ ట్రైలర్‌లో మనకు కేవలం తారక్, చరణ్‌లు మాత్రమే కాకుండా సినిమాలోని మిగతా టాప్ స్టార్స్ అందరూ కనిపించారు. అయితే ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోయే అంశాలు కూడా ట్రైలర్‌లో చూపించారు. ముఖ్యంగా పులితో తారక్ ఫైట్‌ను ఓ రేంజ్‌లో చూపించనున్నట్లు చిన్న క్లూ ఇచ్చారు. అటు ట్రెయిన్ యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్.. అబ్బో ఇలా ఆర్ఆర్ఆర్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అంశాలు చాలానే ఉన్నాయి.

కాగా ఇద్దరు హీరోలు చేతులు కలిపాక ఈ సినిమాలో డైలాగులు అదిరిపోయే రేంజ్‌లో పేలనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో ‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా’’ అని చరణ్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఒక ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు ఈ ట్రైలర్ చెబుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేసి ఆ తరువాత ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అప్పుడే యూట్యూబ్‌ను రఫ్ఫాడించేందుకు రెడీ అయ్యింది. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ఇక ఈ సినిమాను చూసేందుకు వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ టాక్: నక్కల వేట కాదు.. కుంభస్థలాన్ని బద్దలుకొట్టేశారు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts