మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్.. కొద్ది నెలల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని కూడా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకే భవ్య బిష్ణోయ్‌తో తను వివాహం రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక పెళ్లి క్యాన్సిల్ అయినప్పటికీ ఎటువంటి బెంగా లేకుండా మళ్లీ సినిమాలతో బిజీ అయిన మెహ్రీన్‌పై ఓ స్టార్ డైరెక్టర్ మనసు పారేసుకున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. ఈయన రవితేజతో తెరకెక్కించిన `రాజా ది గ్రేట్` సినిమాలో మొదటి సారి మెహ్రీన్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో ఆమె నటనటకు ఫిదా అయిన అనిల్ రావిపూడి ఎఫ్ 2లో అవకాశం ఇవ్వగా.. అందులోనూ మెహ్రీన్ అదరగొట్టేసింది.
ప్రస్తుతం మెహ్రీన్‌తో ఎఫ్ 3 సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రాన్ని బాలయ్యతో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా మెహ్రీన్‌నే అనిల్ రావిపూడి తీసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే త్వరలోనే ఈ సినిమాపై మెహ్రీన్ నుంచి గుడ్‌న్యూస్ రానుంది.