‘ఆర్ఆర్ఆర్ ‘ నే నమ్ముకున్న ప్రముఖ ఓటీటీ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం చేత ప్రతి సారి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.. ఇకపోతే తయారీదారులు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం విస్తృత శ్రేణిలో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ చిత్ర బృందం పివిఆర్ మల్టీప్లెక్స్ చైన్ తో సంబంధం కుదుర్చుకుని, ఆ తర్వాత పివిఆర్ఆర్ఆర్ హోర్డింగ్ లతో ముందుకు వచ్చింది.

అంతేకాదు భారతదేశం అంతటా ఈ సినిమా నుంచి కొన్ని ప్రోమోలు విడుదల చేసి ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందింది.. అందుకే చాలా మంది ప్రేక్షకులు థియేటర్ల లోని ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇక పోతే రోజులు పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ సినిమా బజ్ తగ్గిందనే చెప్పాలి. అందుకే నిర్మాతలు కూడా అవకాశం వచ్చిన ప్రతి చోట తమ సినిమాను అమ్మేస్తున్నారు.ఇదిలా వుండగా డిజిటల్ హక్కులను తెలుగు ,తమిళ్ ,కన్నడ తో పాటు మలయాళం భాష కోసం కూడా zee5 కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాదు మొదటిసారి దక్షిణ భారత దేశంలో ఇంత పెద్ద సినిమాని కొనుగోలు చేయడం పై Zee 5 కే మాత్రమే సాధ్యమైంది. దక్షిణ భారతదేశంలో తన సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసమే ఈ చిత్రంపై తన ఆశలన్నీ పెట్టుకుంది Zee5. జి ఫైవ్ ఉత్తర భారతదేశంలో బాగా విస్తరించిన ఇప్పటికీ దక్షిణాది భారతదేశంలో పెద్దగా సబ్స్క్రైబర్లు లేరు.. అందుకే ఆర్ ఆర్ ఆర్ భారీ విజయాన్ని అందుకుంటే జి ఫైవ్ దక్షిణ భారతదేశంలో సబ్స్క్రైబర్లు లను ఎక్కువ చేరుకోవడంలో సహాయపడుతుంది.