యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కాకపోతే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్స్లో భాగంగా ఏమేం చేయాలో అన్ని చేసేస్తున్నారు.

ఇకపోతే రోజుల్లో పెద్ద స్టార్ల సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైనప్పుడల్లా, నిర్మాతలు యూట్యూబ్‌లో ప్రకటనలుగా ప్రచారం చేయడానికి చాలా రూపాయలు ఖర్చు చేస్తున్నారు. టీజర్ ఆర్గానిక్‌గా సాగాలని, వ్యూస్‌ పరంగా రికార్డులను లక్ష్యంగా పెట్టుకోకుండా ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేవీ ఇవ్వలేదని RRR బృందం వెల్లడిస్తోంది. అయితే, ఈ ప్రకటనల వల్ల చాలా మందికి తన సినిమా ఎందుకు చేరలేదు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు..అయితే మరొక కారణం కూడా ఉంది.

RRR ప్రమోషన్స్ YouTubeలో DVV దానయ్య యొక్క ఛానెల్ T సిరీస్‌తో సహా రెండు ఛానెల్‌లలో అప్‌లోడ్ చేయబడింది.అది వీక్షణల విభజనకు కూడా దారితీసింది. యూట్యూబ్ లో పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన టీజర్లకు ఒక్కరోజులోనే లక్షల వ్యూస్ నమోదయ్యాయి.. తమ సినిమా ఏ రోజు కూడా అలాంటి రికార్డులు సృష్టించలేదు అందుకే ఇకపై యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ కి ఎటువంటి పైసా కూడా ఖర్చు పెట్టమని ఆర్ఆర్ఆర్ బృందం స్పష్టం చేసింది.