మా ఉద్యోగాలు ఏమి అయినా పర్వాలేదు కానీ రోబోలు కావాలి అంటున్న ఉద్యోగులు …?

మన టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. మనిషి తయారు చేసిన మెషీన్స్ వలన మానవుడు చేయలేని పనిని మెషీన్స్ ఎంతో సులభంగా చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ముందుగా చెప్పుకోవాలిసిన టెక్నాలజీ ఎదన్నా ఉంది అంటే అది రోబోట్ లు అని చెప్పవచ్చు. మనిషి వల్ల కానీ పనిని రోబోలు చాలా చాకిచక్యంగా చేసేస్తున్నాయి. అందుకేనేమో రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోల పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కాలంలో ఒరాకిల్‌ సంస్థ జూలై 27 నుంచి ఆగస్టు 17 మధ్యకాలంలో ప్రముఖ దేశాలలో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు చూస్తే మనుషుల కంటే రోబోలె 82% ఎక్కువగా పనిచేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది.

కరోనా మహమ్మారి కారణంగా వర్క్‌ప్లేస్‌లో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై ఒరాకిల్‌ సంస్థ ‘ఏఐ@వర్క్: 2021 గ్లోబల్ స్టడీ’ అనే పేరుతో ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా మనుషుల కంటే రోబోలు మెరుగ్గా పనిచేయగలవా అన్న ప్రశ్నకు సమాధానంగా పలు టెక్‌ నిపుణులు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. మనుషుల కంటే రోబోట్‌లో 82% మెరుగ్గా పనిచేస్తాయని అంటున్నారు. నిజానికి కరోనా వల్ల ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు తలెత్తినట్లు ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు తెలిపారు.

కాగా 83% మంది కెరీర్‌ లో మార్పు కోరుకుంటున్నామని, 93% మంది తమ వ్యక్తిగత జీవితంలో మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే 76% మంది ఉద్యోగులు ఒక రంగం నుంచి మరో రంగానికి మారడానికి ఆసక్తిగా ఉన్నట్టు, 88% మంది పని వల్ల, మానసిక ఆరోగ్యం, ఫ్లెక్సిబిలిటీ కారణాల వలన విజయం యొక్క అర్థం మారిపోయిందని చెప్పారు. అంతేకాకుండా ఇక ఈ సర్వేలో 85% మంది ఉద్యోగులు తమకి సపోర్ట్‌ చేయడం లేదని తెలిపారు. 87% మంది తమ కంపెనీలు తమ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా పనితీరుకల్పించాలని కోరుకుంటున్నారు.