సామ్‌-చైతు విడాకుల‌పై నాగ్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైత‌న్య – స‌మంత విడిపోయారు. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని, ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని.. అయితే భార్య‌-భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ స్నేహ బంధం మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతంద‌ని చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Tollywood's dream couple Samantha, Naga Chaitanya announce separation

ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్ రావ‌డంతో అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గుర‌య్యారు. మ‌రోవైపు కొడుకు-కోడ‌లు విడిపోవ‌డంపై కింగ్ నాగార్జున్ ఎమెష‌న‌ల్‌గా రియాక్ట్ అయ్యారు. `బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను.. సామ్-చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య మరియు భర్త మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది.

Samantha Akkineni And Naga Chaitanya: Here's what caused a rift between Samantha Ruth Prabhu and Akkineni Naga Chaitanya? Details inside

సామ్ మరియు చై ఇద్దరూ నాకు ప్రియమైనవారు, నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది మరియు ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది. దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక` అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దాంతో ప్ర‌స్తుతం ఆయ‌న ట్వీట్‌ నెట్టింట వైర‌ల్‌గా మారింది.