నియంతల పతనం తప్పదంటున్న సమంత..!

సమంత ఈరోజు ఉదయం షేర్ చేసిన పోస్ట్ కాస్త.. ఇప్పుడు వీరు విడాకులు ఖరారైన తర్వాత వైరల్ గా మారింది. అయితే ఆమె చాలా ఎమోషనల్ కి గురి అవుతూ పోస్ట్ పెట్టడం అందరి మనసులను కలచివేస్తోంది. సమంత సోషల్ మీడియా ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.. అంతే కాదు సమంత చేత ఎవరో బలవంతంగా కావాలని విడాకులు ఇప్పించారు అనే విషయం గట్టిగా ఋజువు అవుతోంది.. సమంత ఏం పోస్ట్ చేసింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేను ఎప్పుడూ బాధలో వున్నా.. విచారంలో ఉన్నా ఖచ్చితంగా మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో ఎప్పుడూ ప్రేమ, నిజాయితీ మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. కొందరు హంతకుల, నియంతలు ఉంటారు.. నమ్మించి వెన్నుపోటు పొడుస్తారు. వారి గెలుపు ఎప్పుడూ కూడా తాత్కాలికమే. వారు ఎప్పటికయినా నేల కొరగక తప్పదు. ఇదే జరిగి తీరుతుంది. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం` అంటూ సమంత సోషల్ మీడియాలో పేర్కొంది.