అక్కినేని ఫ్యామిలీ లో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లు..?

గత కొద్ది కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఒకరి పేరు ఒకరు టాటో వేయించుకున్నారు. కానీ విడాకుల కంటే ముందే తన చేతి పై ఉన్న టాటో ని చెరిపేశాడు నాగ చైతన్య. సమంత కూడా తన పేరులో అక్కినేని అన్న పదం తొలగించడంతో వీరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలను నిజం చేస్తూ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే అక్కినేని ఫ్యామిలీలో స్క్రీన్ మీదకు వచ్చి నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే అయ్యాయి. ముందుగా అక్కినేని నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత అమల ను వివాహమాడారు. అలాగే హీరో సుమంత్ కూడా కీర్తి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. అలాగే అక్కినేని సుప్రియ కూడా ఇష్టం సినిమా హీరో తో పెళ్లి పెటాకులు చేసుకుంది. అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కి ముందే డీల్ క్యాన్సిల్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇది తాజాగా అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇలా అక్కినేని ఫ్యామిలీ లో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్ లు అయ్యాయి.