75 పెళ్లిళ్లు.. 200 మందిని వ్యభిచారంలోకి.. చివరికి ఏమైందంటే?

సమాజంలో రోజురోజుకీ మహిళలకు భద్రత కరువవుతోంది. కామాంధులు ఎటు వైపు నుంచి ఎలా వస్తారో తెలియక ఆడవారు గుప్పు గుప్పు మంటూ బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా పోలీసులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇటీవల ఒక సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 75 మంది ని పెళ్లి చేసుకొని , 200 మందిని వ్యభిచార ఊబి లోకి దింపిన ఒక నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మునిర్ గుజరాత్లోని సూరత్ లో పోలీసులకు పట్టుబట్టాడు. బంగ్లాదేశ్ లోని జూసుర్ కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్ ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి కోసం అనే భారత్ కి అక్రమంగా రవాణా చేసే వాడు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ మీదుగా ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని సాగించేవాడు. అయితే ఈ నేపథ్యంలోనే సరిహద్దులోని అధికారులకు మునిర్ 25 వేలు చొప్పున లంచం ఇచ్చేవాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ యువతులను ముంబై, కోల్కతా ప్రధాన కేంద్రాలుగా వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. ఇలా దాదాపుగా 200 మంది యువతులను భారత్లోకి అక్రమ రవాణా చేసినట్లు తెలిపారు. మరొకవైపు తాను ఇప్పటి వరకు 75 మందిని పెళ్లి చేసుకున్నట్లు మునిర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.