ఇకపై సమంత నివాసం అక్కడేనట..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత,నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇటీవలే అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అని ప్రకటించడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు, ఇటు అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మేము భార్యాభర్తలుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా ఉంటాము అంటూ ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి విడాకులు తరువాత సోషల్ మీడియాలో వీరికి సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా కూడా అది నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అంతే కాకుండా సమంతా కూడా ఈ విషయం పట్ల ఏమైనా స్పందిస్తుందా, అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆమె ఏ పోస్ట్ చేసినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్డేట్స్ మీద పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి విడాకుల తర్వాత సమంత ఎక్కడ ఉండబోతుంది అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో సమంత ముంబై లో ఇల్లు కొనింది అని అక్కడికి మకాం మార్చేస్తుందని వార్తలు వినిపించినప్పటికీ.. లేదు హైదరాబాదులో ఉన్న హోమ్ టౌన్.. ఇప్పటికీ.. ఎప్పటికీ అని సమంత స్పష్టం చేసింది. అయితే హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ ప్లాట్ లో సమంత నివసించునట్లు సమాచారం. ప్రస్తుతం సమంత. శాకుంతలం, కాతు వాకుల రెండు కాదల్ చిత్రాల్లో నటిస్తోంది.