ఆ ఇద్దరూ సంతోషపడేలా జగన్ నిర్ణయం!

వైసీపీలో ఇద్దరు నాయకులు బాగా అసంత్రుప్తిగా ఉన్నారు. ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం సీఎం, పార్టీ చీఫ్ జగన్ కు కూడా తెలుసు. తనకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని తమ్మినేని చాలా రోజులుగా అడుగుతున్నాడు.. సమయం ఇంకా రాలేదు కదా అని జగన్ అనుకుంటున్నాడు.. ఇక ధర్మాన ప్రసాదరావు అయితే.. తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నాడు. ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు పార్టీలో ఒక్క పోస్టు కూడా రాలేదని, తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నాడు. దీంతో వీరిద్దరినీ సంతోషపరచడానికి జగన్ ఓ ప్లాన్ రూపొందించినట్లు తెలిసింది.

వచ్చే అక్టోబర్ లో మంత్రి వర్గంలో మార్పులుండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రులను మారుస్తానని గతంలోనే జగన్ చెప్పేశాడు. దీంతో దసరా సందర్బంగా ఈ మార్పులు చోటు చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే తమ్మినేని కోరిక మేరకు ఆయన్ను ఈసారి కేబినెట్ లోకి తీసుకోవచ్చు. మరి స్పీకర్ గా ఎవరిని నియమించే అవకాశముందనేది తరువాత తలెత్తే ప్రశ్న. దానికి సమాధానమే ధర్మాన ప్రసాదరావు. అంటే శ్రీకాకుళం జిల్లా వాసులతోనే ఈ మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలిసింది. మరి అదే జిల్లాకు చెందిన మంత్రి అప్పలరాజు పరిస్థితేంటి అనే ప్రశ్నలూ వస్తాయి. ఇంకేముంది తమ్మినేతి మంత్రి అవుతున్నాడు కదా.. ఈయన అంతే అని తెలిసింది. ధర్మాన, తమ్మినేనిల సంతోషం కోసం అప్పలరాజు తన మంత్రి పదవి పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. ఏం చేస్తాం.. ఎవరి లెక్కలు వారివి.. ఎవరి రాజకీయాలు వారివి.. ఇందులో నో సెంటిమెంట్స్..