బ‌న్నీతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ..ఇద్ద‌రూ త‌గ్గ‌డం లేదుగా!

September 2, 2021 at 11:40 am

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు.ఎప్ప‌టిక‌ప్పుడు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవ‌ర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, రెడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ ప‌డుతున్నారు.

Allu Arjun conquers Instagram

మొన్నీ మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ‌న్నీ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్ల‌కు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోగా బ‌న్నీ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు బ‌న్నీ రికార్డును విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మం చేసేశాడు.

VDMemes (RowdyArmy)™ on Twitter: "Fastest South Indian Actor To Cross 13  Million Followers In #Instagram @TheDeverakonda 🔥 Back Into The Race To  Claim His Crown 👑 Follow Us @VDMemes_RA For More Memes

సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 13 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకున్నాడు. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఫాలోవ‌ర్స్ ను సాధించిన హీరోగా విజ‌య్‌ క్రేజీ రికార్డ్ సృష్టించాడు. మొత్తానికి ఫాలోవ‌ర్స్ విష‌యంలో అటు బ‌న్నీ, ఇటు విజ‌య్ ఇద్ద‌రూ ఏ మాత్రం త‌గ్గ‌కుండా దూసుకుపోతున్నారు. మ‌రి ముందు ముందు వీరిద్ద‌రూ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

 

బ‌న్నీతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ..ఇద్ద‌రూ త‌గ్గ‌డం లేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts