ఫ‌స్ట్ మూవీకి ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?అస్స‌లు న‌మ్మ‌లేరు!

మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది.

Akkada Ammayi Ikkada Abbayi Telugu Movie Review Pawan Kalyan Sup

అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుద‌లై ఓ మోస్త‌రుగా ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. న‌ట‌న ప‌రంగా, లుక్స్ ప‌రంగా ప‌వ‌న్‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే ఈ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. కేవ‌లం రూ.5 వేలు. అవును, న‌మ్మ‌సక్యంగా లేక‌పోయినా ప‌వ‌న్ త‌న ఫ‌స్ట్ మూవీకి తీసుకున్న పారితోష‌కం ఐదు వేలు మాత్ర‌మే.

Akkada Ammayi Ikkada Abbayi (1996) - IMDb

ఈ విషయాన్ని స్వ‌యంగా పవన్‌నే గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే సొంత నిర్మాణ సంస్థ కావడం, అప్పటికి పవన్ ఎవరికీ తెలియక‌పోవ‌డం వ‌ల్లే అంత తక్కువ రెమ్యూన‌రేస‌న్ తీసుకుని ఉండొచ్చ‌ని అంటారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు పవన్‌తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లు ఇవ్వాల్సిందే. మొత్తానికి ఐదు వేలతో మొదలైన ప‌వ‌న్ సినీ ప్ర‌యాణం 50 కోట్ల‌కు చేరుకోవ‌డం నిజంగా అద్భుత‌మే అని చెప్పాలి.