విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

September 2, 2021 at 11:56 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Bheemla Nayak: Pawan Kalyan 's Bheemla Nayak First Glimpse Response

`సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన.. బెమ్మాజెముడు చెట్టున్నాది` అంటూ మొదలైన ఈ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయిస్తోంది. ఊహించిన దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్న ఈ సాంగ్ ట్యూన్ అద్భుతంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

The Song 'Bhimla Nayak' Means Mass .. Thaman's Tweet Filled Pawan Fans With  Excitement

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థ‌మ‌న్ సంగీతం అదిరిపోయాయి. ఇక సింగ‌ర్స్ శ్రీ కృష్ణ‌, పృథ్వీ చంద్ర‌, రామ్ మిర్యాలా గాత్రం కూడా బాగుంది. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు. మొత్తానికి సబ్ ఇన్స్పెక్టర్ భీమ్లా నాయక్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ సాగిన ఈ సాంగ్ అభిమానుల‌కు మంచి కిక్ ఇవ్వ‌డంతో పాటుగా పవన్ బర్త్ డే ను మరింత స్పెషల్ గా మార్చిందని చెప్పవచ్చు.

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts