అఖండ కోసం బాలయ్య మొదలెట్టేశాడు!

September 2, 2021 at 12:02 pm

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినా, చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను ముగించేసింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసిందట. ఇందులో బాలకృష్ణ కూడా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బోయపాటి సినిమాలో బాలకృష్ణ ఎలాంటి పవర్‌ఫుల్ డైలాగులతో రెచ్చిపోతాడో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి డైలాగులను రెడీ చేశాడట ఈ డైరెక్టర్.

త్వరలోనే ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసి ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండేలా చూస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బ్యూటీ పూర్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

అఖండ కోసం బాలయ్య మొదలెట్టేశాడు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts