మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటార‌ట‌..ఎక్క‌డో తెలుసా?

మూత్రంలో ఉడికించిన గుడ్లు… వామ్మో, విన‌డానికే ఇబ్బందిగా ఉంది క‌దూ. కానీ, కొంద‌రు ప్ర‌జ‌లు ఆ గుడ్ల‌ను లొట్టలేసుకుంటూ తింటార‌ట‌. న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్‌లో ప్ర‌జ‌లు మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో ప్రత్యేక వంటకం చేస్తారు.

Urine-cooked eggs a delicacy in China city: 'Virgin boy eggs' are spring  tradition in Dongyang - New York Daily News

దాని పేరే `వ‌ర్జిన్ బాయ్ ఎగ్‌`. ఈ డిష్‌ను అక్క‌డి వారు ఎంతో ఇష్టంగా, ఇష్ట‌ప‌డి తింటుంటారు. అయితే గుడ్లను ఉడికించడానికి ప‌దేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం సేకరిస్తార‌ట‌. ఇందుకోసం ఫుడ్ స్టాల్ యజమానులు.. స్కూల్స్‌లో ప్ర‌త్యేక‌మైన బకెట్లు ఉంచుతార‌ట‌. ప‌దేళ్ల వ‌య‌సు కంటే తక్కువ ఉన్న పిల్లలను వాటిలో మూత్ర విసర్జన చేయమని చెబుతార‌ట‌.

News24 on Twitter: "Bizarre: URINE-BOILED eggs a spring delicacy in China  #VirginBoyEggs #Urine #Eggs #China http://t.co/GjiK1EICQn  http://t.co/VZgY0iEBkI"

ఆ విధంగా సేకరించిన మూత్రంలో గుడ్లు ఉడికించి.. అప్పుడు ఆ గుడ్ల‌తో డిష్ త‌యారు చేస్తార‌ట‌. ఈ డిష్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని అక్క‌డి వారు న‌మ్ముతారు. అందుకే ఇది ఆ ప్రాంతంలో సంప్రదాయ వంటకంగానూ పేరు తెచ్చుకుంది.

Is the urine-boiled egg available everywhere in Hong Kong? - Quora