లవ్ స్టోరి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాయిగా!

September 25, 2021 at 10:24 am

కరోనా సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.

కరోనా సెకండ్ వేవ్ తరువాత ఓ సినిమాకు ఇలాంటి స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి. ఇక ఆకట్టుకునే కథ ఉంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి లవ్ స్టోరి చిత్రం రుజువు చేసింది. ఈ సినిమా కథ చాలా రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తిని చూపుతున్నారు. కాగా రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. లవ్ స్టోరి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఏకంగా రూ.6.8 కోట్ల షేర్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది.

చాలా రోజుల తరువాత ఈ రేంజ్‌లో ఓ సినిమా వసూళ్లు రాబట్టడం చూసి సినీ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత రాబట్టి ఈ సినిమాకు అదిరిపోయే హిట్‌ను అందించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఏరియాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి చిత్రం కలెక్ట్ చేసిన షేర్ వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3 కోట్లు
వైజాగ్ – 0.60 కోట్లు
ఈస్ట్ – 0.48 కోట్లు
వెస్ట్ – 0.55 కోట్లు
కృష్ణా – 0.32 కోట్లు
గుంటూరు – 0.60 కోట్లు
నెల్లూరు – 0.25 కోట్లు
సీడెడ్ – 1.0 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ. 6.8 కోట్లు(షేర్ వసూళ్లు)

లవ్ స్టోరి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపాయిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts