ఓటిటీ లో రానున్న రాజ రాజ చోర సినిమా.. ఎప్పుడంటే?

September 25, 2021 at 10:29 am

హీరో శ్రీ విష్ణు తాజాగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర. కామెడీ ఎంటర్ టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా త్వరలోనే ఓటు లో విడుదల కానుంది.ఈ సినిమాకు హితేష్ గోలి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో మేఘ ఆకాశ్, సునైనా హీరోయిన్లు. ఈ సినిమాలో జిరాక్స్ షాప్ లో పనిచేసే భాస్కర్ ( శ్రీ విష్ణు ) తన అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు.

కానీ పైకి మాత్రం తాను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలా సంజన అలియాస్ మేఘా ఆకాశ్ తో ప్రేమాయణం సాగిస్తాడు.మరొక హీరోయిన్ విద్య ( మేఘ ఆకాష్ )కు భాస్కర్ తో అప్పటికే పెళ్ళి జరిగే ఒక బాబు కూడా ఉంటాడు.

అయితే అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్న భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నదే ఈ సినిమా ఒక కథ. అయితే ఇప్పటికే థియేటర్స్ లో విడుదల అయినా ఈ సినిమా అక్టోబర్ 8 నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కామెడీ ప్రధానంగా రూపొందడంతో విశేష స్పందన లభించింది.

ఓటిటీ లో రానున్న రాజ రాజ చోర సినిమా.. ఎప్పుడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts