ఆ యంగ్ హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ఫైర‌వుతున్న నెటిజ‌న్స్‌?

September 24, 2021 at 1:41 pm

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండ‌గానే శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం ప‌ట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ర‌వితేజ ఈ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Ravi Teja-starrer Khiladi release postponed amid Covid-19 second wave |  Entertainment News,The Indian Express

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న‌ ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీలతో ర‌వితేజ రొమాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. ఆమెనే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sreeleela feels that working with Raghavendra Rao was a journey of  self-discovery for her | Kannada Movie News - Times of India

అయితే ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. కానీ, త‌న వ‌య‌సులో స‌గం కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న శ్రీ‌లీల‌తో ర‌వితేజ జోడీ క‌ట్ట‌డం ఏ మాత్రం స‌రికాదంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా, శ్రీ‌లీల విష‌యానికి వ‌స్తే.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపుదిద్దుకున్న `పెళ్లి సంద‌D` చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఇదే ఆమెకు తెలుగులో తొలి చిత్రం. ఈ సినిమా పోస్టర్లు, పాటలు, ట్రైల‌ర్ ద్వారా శ్రీ‌లీల సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఆ యంగ్ హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ఫైర‌వుతున్న నెటిజ‌న్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts