అంబానీతో బంధం ఎలా కొనసాగుతోంది..?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. శుత్రువులు మిత్రులు కావచ్చు.. మిత్రులు శత్రువులు కావచ్చు.. అదేగా రాజకీయం.. ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇదే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్స్ కంపెనీ వాళ్లే.. అంటూ అప్పట్లో రిలయన్స్ షోరూములపై దాడులు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. జగన్ కూడా అప్పట్లో రిలయన్స్ నే టార్గెట్ చేశారు. అయితే తరువాత ఎన్నికలు రావడం.. జగన్ సీఎం సీటులో కూర్చోవడంతో సమీకరణలు మారిపోయాయి. అంబానీలతో ఇపుడు జగన్ స్నేహ హస్తం అందుకున్నాడు. అందుకు నిదర్శనం జగన్ సీఎం అయిన తరువాత ముఖేష్ అంబానీ తాడేపల్లికి స్వయంగా వచ్చి తన ఫ్రెండ్ పరిమల్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వాన్ని అడిగాడు.. ఆయన అడిగిన వెంటనే రాజ్యసభ సభ సభ్యత్వం ఇచ్చేశారు. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

వైఎస్ జగన్ తన మ్యారేజ్ డే సిల్వర్ జూబ్లి వేడుకల సందర్భంగా గత వారం భార్యతో కలిసి షిమ్లా, డార్జిలింగ్ లో పర్యటించారు. ఐదు రోజుల పాటు వారు అక్కడే గడిపారు. ఆ తరువాత విజయవాడకు విమానంలో తిరిగి వచ్చారు. ఒక సీఎం స్పెషల్ ఫ్లైట్లో తిరిగి రావడం గొప్పేమీ కాదు కానీ.. ఆ వచ్చిన ఫ్లైట్ అడాగ్ చీఫ్ అనిల్ అంబానిది కావడం విచిత్రం. ప్రత్యేక విమానం విజయవాడకు వచ్చినపుడు ఎవరిదీ విమానం అని పలువురికి సందేహాలు కూడా వచ్చాయి. జయ్ అనుమోల్, జయ్ అన్షుల్ అని ఫ్లైట్ డోర్లపై రాసి ఉంది. ఎవరివీ పేర్లు అని ఆరా తీస్తే అవి అనిల్ అంబానీ పిల్లలవని తెలిసింది.

విచిత్రమేమంటే బ్యాంకు రుణాలు తీసుకొని చెల్లించలేని స్థితిలోఉన్న అనిల్ అంబానీకి స్పెషల్ ఫ్లైట్ ఉందా అని చాలా మంది అనుకుంటారు. అయితే.. ఆ విమానం సోదరుడు ముఖేష్ అంబానీ ఆధీనంలో ఉందని తెలిసింది. ఏదేమైనా అంబానీ బ్రదర్స్ ఏపీ సర్కారుతో స్నేహ బంధం కొనసాగిస్తున్నారు అనడానికి ఈ సంఘటనలే నిదర్శనం.