మంగ్లీ చేసిన ప‌నికి షాకైన నితిన్‌..అలా చేస్తుంద‌నే ఊహించ‌లేద‌ట‌..?!

September 15, 2021 at 7:49 am

ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీపై హీరో నితిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు మంగ్లీ, నితిన్‌ల‌కు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్ర‌స్తావించాడో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. సింగ‌ర్ మంగ్లీ కూడా కీల‌క పాత్ర పోషించింది.

Singer Mangli photos on Karnataka public buses .. Penalty for being like that .. - The Post Reader

బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఎన్నో విష‌యాలు షేర్ చేసుకున్న నితిన్ మంగ్లీ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Singer Mangli Entry In Movies With Nithin Maestro Movie Netizens Trolling September 9 Release Disney Hotstar Andhadhun Remake Tollywood - Telugu And-TeluguStop

`ఈ చిత్రంలో ఓ పాత్రకు మంగ్లీ సరిపోతుందని మా నాన్న అన్నారు. కానీ నేను న‌మ్మ‌లేదు. ఆమె సింగర్ కదా? అని అనుకున్నాను. కానీ డైరెక్టర్ ఓ సీన్ తీసి.. ఆమె బాగా చేస్తోందని అన్నాడు. ఇక నేను సెట్‌లోకి వెళ్లినప్పుడు, ఆమెతో కలిసి నటించినప్పునడు ఆమె యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను. అంత బాగా న‌టిస్తుంద‌ని నేను ఉహించ‌లేదు. ఇకపై ఆమె సింగర్‌గానే కాదు, యాక్ట‌ర్‌గానూ బిజీ అవుతుంది` అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.

మంగ్లీ చేసిన ప‌నికి షాకైన నితిన్‌..అలా చేస్తుంద‌నే ఊహించ‌లేద‌ట‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts