నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?

బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను హీరో నితిన్ పంచుకున్నారు.

అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సింగర్ మంగ్లీ మాస్ట్రో సినిమాని ఉద్దేశించి మాట్లాడింది. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర కూడా నాకు బాగా సెట్ అవుతుంది. అలాగే నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిది. నితిన్ హీరో అయినా కూడా తాను హీరో అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా సాధారణ వ్యక్తిలా మాతో కలిసిపోయారు అంటూ తెలిపింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఒక బ్రదర్ లాగా చూసుకున్నాడు అంటూ మంగ్లీ తెలిపింది.