నువ్వు లేకపోతే నేను లేను అంటున్న జ‌య‌మ్మ‌..ఇంత‌కీ ఎవ‌రికోస‌మంటే?

September 15, 2021 at 8:14 am

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురిగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. `తెనాలి రామకృష్ణ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వ‌ర‌ల‌క్ష్మీ.. ఆ మ‌ధ్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న `క్రాక్‌` సినిమాతో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది.

Varalaxmi Sarathkumar into Casting couch row: I have proof - tollywood

ఆ త‌ర్వాత అల్ల‌రి నరేష్ హీరోగా తెర‌కెక్కిన నాంది సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం మ‌న జ‌య‌మ్మ తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రమేష్ అనే వ్యక్తి గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నువ్వు లేకపోతే నేను లేను అంటూ త‌న ప్రేమ‌ను చాటుకుంది.

Varalaxmi Sarathkumar | Varalaxmi Sarathkumar Maari 2 Tamil … | Flickr

ఇంత‌కీ ర‌మేష్ ఎవ‌రంటే.. వ‌ర‌ల‌క్ష్మీ మేక‌ప్ ఆర్టిస్ట్‌. కెరీర్ ప్రారంభం నుంచి వ‌ర‌ల‌క్ష్మీకి అత‌డే మేక‌ప్ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. అయితే నిన్న అత‌డి పుట్టిన రోజు సంద‌ర్భంగా `నువ్ లేకపోతే నేను ఏం చేయలేను.. చేయగలిగేదాన్నికాదు.. నువ్ కేవలం నా మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. నువ్ నా కుడిభుజం లాంటి వాడివి. నువ్ లేకపోతే నా జర్నీ ఇంత వరకు వచ్చేది కాదు..నీకు నేను ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను.. హ్యాపీ బర్త్ డే` అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

నువ్వు లేకపోతే నేను లేను అంటున్న జ‌య‌మ్మ‌..ఇంత‌కీ ఎవ‌రికోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts