చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?

September 15, 2021 at 8:16 am

ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా హైదరాబాద్ లోనే హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఒక కామాంధుడి చేతిలో బలి అయిన ఆరేళ్ళ చిన్నారి విషయమే వినిపిస్తోంది. కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది అంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తున్నాయి అంటూ తెలిపారు.

అలాగే మన బిడ్డలు సురక్షితమేనా! అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలి పోవాలా? ఆ చిన్నదాని కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఃఖంలో మునిగిపోయిందో ఊహించలేం అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. హీరో మంచు మనోజ్ కూడా చనిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఆ చిన్నారిని అంత దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే చిన్నారి జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ఆ నిందితుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts