అందరికీ ఉచితంగా అధునాతన వైద్య సేవలు..ఎక్కడంటే..?

మనం జీవితంలో సంపాదించిన డబ్బంతా అనారోగ్యాలపాలు అయితే కచ్చితంగా హాస్పిటల్ కి పెట్టాల్సి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇటీవల ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ వంటి వాటి వల్ల ప్రజలు ఆసుపత్రులలో బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు.. ఇక్కడ ఒక హాస్పిటల్ వర్గాల వారు ఉచితంగా అందరికీ అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని ప్రకటించడం జరిగింది..అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా.. ఈ హాస్పిటల్ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కర్నూలు జిల్లాలోని, నంద్యాల పట్టణం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ లో అన్ని రకాల రోగాలకు ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం తో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు.. రోగులకు కావలసిన నీరు , ఆహారం వంటి వాటికి కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సరఫరా చేస్తారు.. ఇక అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయి.

అధునాతనమైన ఎన్ఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కూడా కలదు. ఇక తెల్లరేషన్ కార్డు కలిగిన రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయ్ హెల్త్ స్కీం ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.. ఇక వివరాల మేరకు.. ల్యాండ్ లైన్ నెంబర్..08514 – 222444 లేదా సెల్ నెంబర్ ..9866348446.. ఈ నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.